|
|
by Suryaa Desk | Mon, Jun 02, 2025, 01:30 PM
బాలీవుడ్ నటి విద్యాబాలన్ గురించి సినీ ప్రియులకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఆమె, ఎన్టీఆర్ బయోపిక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. ప్రస్తుతం సుధీర్ బాబు నటిస్తున్న ‘జటాధర’ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే, సూపర్ స్టార్ రజనీకాంత్‌తో ఓ సినిమాలో నటించనున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కెరీర్ పరంగా బిజీగా ఉంటూనే, బయట తన అభిప్రాయాలను ముక్కుసూటిగా చెప్పే విద్యాబాలన్, తాజాగా ఓ ఇంటర్వ్యూలో సినిమా పరిశ్రమ, నటన వంటి విషయాలపై కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.సినిమా రంగంలో మార్పులు అనేవి చాలా సాధారణమని, మారుతున్న కాలానికి, పరిస్థితులకు అనుగుణంగా నటీనటులు కూడా తమను తాము మార్చుకోవాలని విద్యాబాలన్ అన్నారు. ముఖ్యంగా, కథానాయికలు తమకు వచ్చే అవకాశాలను బట్టి ఎప్పటికప్పుడు తమను తాము కొత్తగా ఆవిష్కరించుకోవాలని, అప్పుడే పరిశ్రమలో ఎక్కువ కాలం కొనసాగే అవకాశం ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. అలా మారలేని వారు క్రమంగా ప్రేక్షకులకు దూరమై, ఫేడ్ అవుట్ అవుతారని ఆమె స్పష్టం చేశారు.
Latest News