|
|
by Suryaa Desk | Mon, Jun 02, 2025, 03:06 PM
తమిళ చిత్రం 'టూరిస్ట్ ఫ్యామిలీ' ఇటీవలే విడుదలై బాక్స్ఆఫీస్ వద్ద భారీ సంచలనం సృష్టిస్తోంది. ఈ కామెడీ డ్రామా ఇప్పటివరకు 75 కోట్లు వాసులు చేసింది. ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని జియో హాట్ స్టార్ సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు, ఈ సినిమా జూన్ 2న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళంలో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చినట్లు సమాచారం. స్ట్రీమింగ్ ప్లాట్ఫారం స్పెషల్ పోస్టర్ ని విదుఃధాల చేసి అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రంలో శశి మరియు సిమ్రాన్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. అబీషన్ జీవింత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భగవంత్, యోగి బాబు, మిథున్ జై శంకర్, కమలేష్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. మిలియన్ డాలర్ స్టూడియోలు మరియు MRP ఎంటర్టైన్మెంట్ నిర్మించిన ఈ చిత్రానికి సంగీతాన్ని సీన్ రోల్డాన్ స్కోర్ చేశారు.
Latest News