|
|
by Suryaa Desk | Tue, Jun 03, 2025, 02:15 PM
టాలీవుడ్ యంగ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో నటించిన 'మెకానిక్ రాకీ' చిత్రం నవంబర్ 22, 2024న భారీ ఎత్తున విడుదల అయ్యి ప్రేక్షకుల నుండి సానుకూల స్పందనను పొందింది. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి ఈ సినిమాని దేశవ్యాప్తంగా విడుదల చేసింది. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ సరసన మీనాక్షి చౌదరి జోడిగా నటిస్తుంది. ఈ సినిమా యొక్క శాటిలైట్ రైట్స్ ని జీ తెలుగు ఛానల్ సొంతం చేసుకుంది. ఈ యాక్షన్ కామెడీ జూన్ 8న ఉదయం 9 గంటలకి వరల్డ్ టెలివిషన్ ప్రీమియర్ ని ప్రదర్శించనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్ కీలక పాత్రలో నటించారు. నరేష్, వైవా హర్ష, హర్షవర్ధన్ మరియు రోడీస్ రఘు రామ్ వంటి ప్రముఖ నటులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్‌పై రామ్ తాళ్లూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
Latest News