by Suryaa Desk | Thu, Nov 28, 2024, 05:13 PM
రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం ఖండించింది. నిరాధార ఆరోపణలు సరికాదని, ఇలాంటివి చెడు ప్రభావం చూపుతాయని పేర్కొంది. కేటీఆర్ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని, ప్రజాస్వామ్యానికి హానికరమని తెలిపింది. ఈ విషయంలో తాము కలెక్టర్‌కు అండగా ఉంటామని ఐపీఎస్ అధికారుల సంఘం వెల్లడించింది.సిరిసిల్లలో ఇటీవల నిర్వహించిన బీఆర్ఎస్ సమావేశంలో కేటీఆర్... కలెక్టర్‌కు హెచ్చరికలు జారీ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కాంగ్రెస్ కార్యకర్తలా పని చేస్తున్నాడని కేటీఆర్ ఆరోపించారు. తమ పార్టీ నాయకులను పార్టీ మారాలని అడుగుతున్నాడట... ఇలాంటి సన్నాసిని కలెక్టర్‌గా తీసుకొచ్చారంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అతి చేస్తున్న కలెక్టర్లు, అధికారులు రాసిపెట్టుకోవాలని హెచ్చరించారు. కాంగ్రెస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తే మళ్లీ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో చెల్లిస్తామన్నారు. ఈ వ్యాఖ్యలపై ఐపీఎస్ అధికారుల సంఘం స్పందించింది.