by Suryaa Desk | Thu, Nov 28, 2024, 12:46 PM
నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ ఇథనాల్ పరిశ్రమ భారాసకు చెందిన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ కుటుంబానిదేనని.. పీఎంకే డిస్టిలేషన్స్ కంపెనీలో తలసాని కుమారుడు, అల్లుడు భాగస్వాములని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క ఆరోపించారు. బుధవారం సచివాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ‘‘దిలావర్‌పూర్‌లో కర్మాగారం ఏర్పాటు చేయించి.. రైతులను ముంచే ఆలోచన చేసింది భారాస ప్రభుత్వమే. ఇప్పుడు అదే పార్టీ రైతులను రెచ్చగొట్టి ప్రజాప్రభుత్వంపై కుట్రలు చేస్తోంది. అక్కడ ఇథనాల్ కర్మాగారం ఏర్పాటు చేసుకునేందుకు 2023 ఏప్రిల్ 3న అప్పటి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. 2023 జూన్ 15న కాళేశ్వరం ప్యాకేజీ నం.27 నుంచి ఏడాదికి 18.351 ఎంసీఎఫ్‌టీ నీళ్లను కేటాయిస్తూ నీటిపారుదల శాఖ ఉత్తర్వులు ఇచ్చింది’’ అని సీతక్క తెలిపారు. మిషన్ భగీరథపై ప్రజలకు విశ్వాసం, అవగాహన కల్పించాలని మంత్రి సీతక్క సూచించారు. నీళ్ల నాణ్యతను ప్రజలకు వివరించేలా రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు సదస్సులు నిర్వహించాలని ఆదేశించారు. మిషన్ భగీరథపై బుధవారం మంత్రి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ‘ఆర్వో, బోరు నీళ్ల ద్వారా ఏ విధమైన సమస్యలు తలెత్తుతాయో ప్రజలకు వివరించాలి.