by Suryaa Desk | Thu, Nov 28, 2024, 09:58 AM
పెద్దపల్లి జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్ జూలపల్లి గ్రామ నూతన పద్మశాలి సేవా సంఘం కమిటీని పద్మశాలి సేవా సంఘం సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికవగా రఘువీర్ సింగ్ వారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేసి కమిటీని మర్యాదపూర్వకంగా శాలువాతో సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా రఘువీర్ సింగ్ మాట్లాడుతూ.. పద్మశాలి సేవా సంఘం సభ్యులకు గత బి ఆర్ ఎస్ పార్టీ ప్రభుత్వంలో వారికి కమ్యూనిటీ భవనాన్ని నిర్మించడం జరిగిందని ఇంకా భవిష్యత్తులో వారికి ఎలాంటి సమస్యలున్న పరిష్కరించడానికి అందుబాటులో ఉంటానని, వారికి ఎలాంటి ఆపద వచ్చిన వారి కుటుంబంలో ఒక సభ్యుడిగా ఉంటానని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పద్మశాలి సేవా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో జూలపల్లి గ్రామ పద్మశాలి సేవా సంఘం నూతన అధ్యక్షులు మేరుగు రమేష్, ఉపాధ్యక్షులు కోడూరి రాజేశ్వర్, కొండ సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి సిరిపురం సత్తయ్య, కోశాధికారి మెరుగు కనకయ్య, సంయుక్త కార్యదర్శిగా సాంబారి ఆంజనేయులు, బైరి భూమయ్య కార్యనిర్వాహక కార్యదర్శిగా,కార్యవర్గ సభ్యులుగా బుదారపు వెంకటేశం, రుద్ర రాజేశం, వెంగళ వెంకటేశం, నాగుల వెంకటేశం, కోడూరి శ్రీనివాస్, దీకొండ సంతోష్, మహిళా అధ్యక్షురాలిగా కొండ విజయ, పద్మశాలి సంఘం సభ్యులతోపాటు ఇతర నాయకులు పాల్గొన్నారు.