by Suryaa Desk | Thu, Nov 28, 2024, 10:55 AM
గత ప్రభుత్వ హయాంలో రోడ్ల అభివృద్దిపై నిర్లక్ష్యం వహించారని, రాష్ట్రంలో కాంగ్రేస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రూ.600 కోట్లతో అభివృద్ది పనులకు నిధులు మంజూరు చేయించినట్లు్ల రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సీ.దామోదర్ రాజనర్సింహ అన్నారు. మంగళవారం అందోలు, పుల్కల్ మండలాల్లో› రూ. 8.47 కోట్ల రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గంలో రోడ్ల అభివృద్దికి రూ.30 కోట్లను కేటాయించిందన్నారు. నాణ్యత విషయంలో ప్రత్యేక చొరవ చూపాలన్నారు. ప్రభుత్వంలో విద్య, వైద్యం, రోడ్లు వంటి మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతను ఇస్తున్నామన్నారు. అందోలు వద్ద నర్సింగ్ కాలేజ్, 150 బెడ్ల హాస్పిటల్ పనులను డిసెంబర్ మొదటి వారంలో ప్రారంభిస్తామన్నారు. 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ ఇస్తున్నామని, గ్యాస్ సిలిండర్ రూ.500కు అందజేస్తున్నామని తెలిపారు. వడ్లకు క్వింటాలకు రూ.500 చొప్పున బోనస్ ఇచ్చి, రైతులకు అండగా నిలుస్తామన్నారు. ఏడాది కాలంలోనే సుమారు 54 వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు.
రోడ్ల పనులకు మంత్రి శంకుస్థాపన అందోలు, పుల్కల్ మండలాల్లో మంగళవారం మంత్రి దామోదర్ రాజనర్సింహ శంకుస్థాపన చేశారు. పుల్కల్ మండలంలో కోడూరు ఎక్స్ రోడ్డు నుంచి బోమ్మారెడ్డిగూడెం మీదుగా అందోలు మండలం కొండారెడ్డి పల్లి వరకు రూ.4.69 కోట్లతో చేపట్టనున్న రోడ్డుకు కోడూరు వద్ద, అందోలు మండలం డాకూరు పీడబ్లు్యడీ రోడ్డు నుంచి మాసానిపల్లి మీదుగా పోతిరెడ్డి పల్లి వరకు రూ.2.38 కోట్లతో చేపట్టనున్న రోడ్డుకు మాసానిపల్లి చౌరస్తా వద్ద, రూ.1.40 కోట్లతో రోళ్లపాడ్ గేటు నుంచి గ్రామం లోపలి వరకు చేపట్టనున్న రోడ్ల పనులకు మంత్రి దామోదర్ శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డీవో పాండు, కమిషనర్ తిరుపతి, పీఆర్ డిప్యూటీ ఈఈ కురుమయ్య, మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, రాష్ట్ర మార్క్‌ఫేడ్ డైరెక్టర్ ఎస్. జగన్మోహన్‌రెడ్డి, గ్రంధాలయ సంస జిల్లా చైర్మన్ గొల్ల అంజయ్య, మార్కెట్ చైర్మన్ ఎం.జగన్మోహన్‌రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ పద్మనాభరెడ్డి, మాజీ స్కోర్ చైర్మన్ సంగమేశ్వర్, మున్సిపల్ వైస్ ౖచెర్మన్ ప్రవీణ్ కుమార్, కౌన్సిలర్‌లు ఎస్.సురేందర్‌గౌడ్, రంగ సురేష్, డి.శంకర్, దుర్గేష్, హరికృష్ణాగౌడ్, సోసైటీ చైర్మన్ జీఆర్.నరేందర్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు శివరాజ్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు.