by Suryaa Desk | Thu, Nov 28, 2024, 09:56 AM
అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ను పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టాలని మెట్ పల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షులు పుప్పాల లింబాద్రి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. న్యాయవాదులపై జరుగుతున్న దాడులకు నిరసనగా మంగళవారం మెట్ పల్లి మున్షిప్ కోర్టులో న్యాయవాదులు విధులను బహిష్కరించారు. నిజామాబాద్ కు చెందిన న్యాయవాది ఖాసిం పై దాడి చేసిన గుండాలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు పుప్పాల లింబాద్రి మాట్లాడారు. తరచూ న్యాయవాదులపై దాడులు జరుగుతున్నాయని వీటిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ బిల్లును ప్రవేశపెట్టాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. పార్టీలకతీతంగా ఎంపీలందరూ కేంద్రంపై ఒత్తిడి తెచ్చి బిల్లు ప్రవేశపెట్టేలా కృషి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఎలుముల రాంబాబు, ప్రధాన కార్యదర్శి తునికి వేణుగోపాల్, న్యాయవాదులు ఒజ్జెల శ్రీనివాస్, వెంకట నర్సయ్య, రాజ్ మహమ్మద్, యుద్ధ వీర్, వెంకటేశ్వర్లు, దయాకర్, లక్ష్మారెడ్డి, మోహన్ రెడ్డి, కోట రాజారెడ్డి, ప్రతాప్, గంగాధర్, సురక్ష, శ్రీధర్, సత్యం తదితరులు పాల్గొన్నారు.