by Suryaa Desk | Thu, Nov 28, 2024, 10:11 AM
హింసకు ప్రధాన కారణం మద్యం మాదకద్రవ్యాలేనని ఐద్వారాస ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మీ అన్నారు ఈరోజు అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక దొడ్డి కొమరయ్య భవనంలో హింస వ్యతిరేక దినం జిల్లా అధ్యక్షురాలు పోలేబోయిన వరలక్ష్మి అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా మల్లు లక్ష్మీ మాట్లాడుతూ దేశంలో నేడు మహిళలపై అనేక రకాల హింసలు జరుగుతున్నాయని వాటిని అరికట్టడంలో మహిళలకు రక్షణ కల్పించడంలో కేంద్ర ప్రభుత్వాలు విఫలం చెందాయని అన్నారు బహిరంగంగా మహిళలను నగ్నంగా ఊరేగిస్తున్న సంఘటనలు సామూహిక అత్యాచారం చేసిన ఘటనలు చూస్తుంటే ఈ దేశంలో మహిళలకు ఇస్తున్న గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు సమాజంలో సగభాగం ఉన్న మహిళలే లేకుంటే దేశ అభివృద్ధి కుంటుపడుతుందని ఆయన ప్రభుత్వ విధానాల వలన మహిళల నిష్పత్తి తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు మహిళలను రెండవ పౌరురాలుగా చూస్తున్నారని అన్నారు మహిళలు సగౌరవంగా తలెత్తుకునే రోజు వచ్చిన నాడే నిజమైన స్వాతంత్రం వచ్చిందని తెలిపారు భారత రాజ్యాంగం ఏర్పడి 75 సంవత్సరాలు నిండిన సందర్భంగా ఈరోజు భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం అని రాజ్యాంగపు ఫలాలు ప్రతి ఒక్కరికి అందే విధంగా పోరాటాలు చేద్దామని తెలియజేశారు ప్రతి ఒక్కరూ హింసకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు రాష్ట్రవ్యాప్తంగా హింసకు వ్యతిరేకంగా ఐద్వా ఆధ్వర్యంలో ఉద్యమాలు నిర్వహిస్తామని అన్నారు.
ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలన్నారు ఆరు గ్యారెంటీలలో బస్సు గ్యారంటీ తప్ప మిగిలినవి అమలు కావడం లేదని అన్నారు ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తామన్న వాగ్దానం ఏమైందని ప్రశ్నించారు రేషన్ కార్డులు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేటికీ అమలు కావడం లేదని అన్నారు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని సంవత్సరం గడిచిన కనీసం ఎక్కడ ఒక్క అడుగు ముందుకు వేయలేదని అన్నారు ప్రభుత్వము వెంటనే ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుంటే ప్రభుత్వంపై మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యురాలు కొండ అనురాధ,జిట్టా సరోజ, నిమ్మల పద్మ, జిల్లా ఉపాధ్యక్షురాలు తుమ్మలపద్మ, చనబోయిన నాగమణి, సుల్తానా,మేకల వర్ణ, జిల్లా కమిటీ సభ్యురాలు ఇందిరా, కనుకుంట్ల ఉమా, కౌసల్య, ఉమాజంజీరాల,భార్గవి, పుష్ప, శశికళ,నాగమ్మ, లక్ష్మి, శీలంపద్మ, తదితరులు పాల్గొన్నారు.