by Suryaa Desk | Thu, Nov 28, 2024, 10:17 AM
వికారాబాద్ జిల్లా ఎస్పీ కె. నారాయణ రెడ్డి జాతీయ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయం లో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. పోలీస్, డీపీఓ సిబ్బంది తో బాధ్యతగల భారత పౌరులుగా చట్టాన్ని గౌరవిద్దాం, ప్రాథమిక హక్కుల్ని పొందుదాం, ప్రాథమిక బాధ్యతల్ని నిర్వర్తిద్దాం, బలమైన ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుతూ బాధ్యతగా నడుచుకుందాం అని ప్రతిజ్ఞ చేయించడం జరిగింది.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ భారత రాజ్యాంగం ద్వారా దేశంలోని ప్రజలందరికి ప్రాధమిక హక్కులను కల్పించడంతో పాటు ప్రజల ప్రయోజనాలు లక్ష్యంగా చట్టాలను సైతం పొందుపరిచారని తెలిపారు . ప్రజల రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యాలుగా ఏర్పడిన పోలీస్ వ్యవస్థలో ఉన్న మనమంతా రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పని చేస్తూ సమాజాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని,రాజ్యాంగ స్పూర్తితో ప్రజలకు మరింత సమర్ధవంతంగా సేవలందిస్తూ దేశాభివృద్ధిలో బాగస్వామ్యం కావాలని సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలస్థంభంగా నిలవడమే కాక ప్రపంచ దేశాలకు మన దేశం ఆదర్శంగా నిలవడంలో భారత రాజ్యాంగం ప్రధాన భూమిక పోషిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమం లో జిల్లా అదనపు ఎస్పీ యూ . రవీందర్ రెడ్డి, ఏఓ జోతిర్మనీ, ఏ ఆర్ డీస్పీ వీరేష్, ఎస్ బి ఇన్స్పెక్టర్ డీవీపీ రాజు , ఆర్ ఐ లు అంజాత్ పాషా, డేవిడ్, ఎస్ ఐ లు, ఆర్ ఎస్ ఐ లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.