by Suryaa Desk | Thu, Nov 28, 2024, 09:54 AM
హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో మంగళవారం రోజున మాలల సింహ గర్జన గోడపత్రికను ఆవిష్కరించిన జాతీయ మాలమానాడు రాష్ట్ర కార్యదర్శి తుప్పరి నరసింహ స్వామి పత్రిక విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ డిసెంబర్ 1న హైదరాబాదులో జరిగే తెలంగాణ మాల సింహగర్జన సమావేశానికి మాలలు అందరూ వేలాదిగా తరలిరావాలని విద్యార్థులు మేధావులు మహిళలు మాల కుల బంధువులందరూ పాల్గొని పిలుపునిచ్చారు.దళితులందరూ కలిసి ఉంటేనే దళిత జాతి అభివృద్ధి చెందుతుందని దళితుల రిజర్వేషన్ పెంచుకో కొనుటకు దళితులందరూ కలిసికట్టుగా ఉండాలని తెలంగాణ రాష్ట్రంలో మాలలు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని దళితుల్లో కొందరు వారి స్వార్థం కోసం వర్గీకరణ పేరుతో దళిత జాతిని విడగొట్టాలని చూస్తున్నారని ఇది దళిత జాతికే తీరని నష్టమని ఎమ్మార్పీఎస్ నాయకుడు మందకృష్ణ మాదిగ తన స్వార్థం కోసం దళిత జాతిని విడగొట్టాలని చూస్తున్నారని అన్నారు.దళిత జాతి వ్యతిరేక పార్టీ అయినా బిజెపి పక్షాన చేరి దళిత జాతిని బిజెపి పార్టీకి తాకాటు పెట్టాలని చూస్తున్నారని అన్నారు.
సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ చేసుకోవాలని తప్పుడు తీర్పు లు ఇప్పించి దళితుల విలగొట్లని చూస్తున్నారన్నారు.భారత రాజ్యాంగం ప్రకారం ఎస్సీ వర్గీకరణ జరగదని మాలలంతా ఎస్సీ వర్గీకరణానికి వ్యతిరేకమని ఎట్టి పరిస్థితుల్లో వర్గీకరణ జరగనివ్వమని దళితులందరూ కలిసి ఉండాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు వంగేటి రాజమౌళి మండల కన్వీనర్ పసుల లక్ష్మీనారాయణ.