by Suryaa Desk | Thu, Nov 28, 2024, 10:29 AM
వివిధ రంగాలలలో విశేష సేవలు అందిస్తున్న క్రిష్టియన్ వ్యక్తులు, సంస్థల నుండి ధరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు, తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వముచే నిర్వహించబడు క్రిస్మన్ వేడుకల కార్యక్రమములో ఎంపిక చేయబడిన అర్హులయిన క్రైస్తవ అభ్యర్థులు, సంస్థలు రాష్ట్ర ప్రభుత్వముచే గౌరవ సత్కారము పొందుట కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనారిటీల సంక్షేమ శాఖ అధికారి కే.హన్మంత్ రావు తెలియజేశారు. సామాజిక సేవారంగం, విశిష్టమైన వైద్య సేవలు, విద్యాబోధన, సాహిత్యం, కళలు, క్రీడా రంగాలలో 10 సంవత్సరముల పైబడి విశేషమయిన సేవలు అందించిన క్రైస్తవులు,విద్య, సామాజిక సేవా రంగాలలో 30 సంవత్సరములు పైగా సేవ చేస్తూ ఉన్నటువంటి క్రైస్తవ సంస్థలు గౌరవ సత్కారం అందుకొనుటకు అర్హులని తెలిపారు.
ధరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు, సంస్థలు తమ ధరఖాస్తులను నిర్ణీత నమూనాలో సంబందిత జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారికి ఈనెల 23 తేదీ నుండి డిసెంబర్ 05 వ తేదీలోపు తమ దరఖాస్తులను జిల్లా మైనారిటీల సంక్షేమ శాఖ అధికారి కార్యాలయం, ఐ డి ఓ సి వికారాబాద్ రూం నంబర్ ఎస్ – 17 నందు ఇవ్వాలని తెలిపారు. నామినేషన్లు www.TGCMFC ఆన్లైన్ నందు గాని లేదా జిల్లా మైనారిటీల సంక్షేమ శాఖ అధికారి కార్యాలయము వికారాబాద్ నందు గాని పొందవచ్చును. మరిన్ని వివరాలకు 040-23391067 ఈ నెంబర్ నందు సంప్రదించాలని తెలిపారు.