by Suryaa Desk | Thu, Nov 28, 2024, 09:51 AM
పెద్దపల్లి మండలం, సబ్బితం గ్రామంలో శ్రీ.సీతారాంజనేయ స్వామి దేవాలయంలో రాష్ట్ర దేవాదాయ & పర్యావరణ, అటవీ శాఖల మంత్రి శ్రీమతి కొండా సురేఖ, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఆలయ అభివృద్ధి కోసం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో సి.జి.యఫ్ ద్వారా ₹ 50,00,000/- లక్షల రూపాయల నిధులతో దేవాలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణా రావు.ముందుగా మంత్రి కొండా సురేఖ కి రాఘవపూర్ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఘన స్వాగతం పలికి అనంతరం రాఘవపూర్ నుండి సబ్బితం గ్రామం వరకు బైక్ ర్యాలీ నిర్వహించిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు.సీతా రామాంజనేయ స్వామి ఆలయానికి విచ్చేసిన మంత్రి, ఎమ్మెల్యే కి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.
తదుపరి ఆలయ అర్చకులు మంత్రి ,ఎమ్మెల్యే ని వెందమంత్రాల సాక్షిగా ఆశీర్వాదహించారు.ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారులు, పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఈర్ల స్వరూప ,పలు గ్రామాల మాజీ సర్పంచ్ లు,మాజీ ఎంపీటీసీ లు,కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.