by Suryaa Desk | Thu, Nov 28, 2024, 10:19 AM
మంగళవారం రైతు వ్యతిరేక మూడు నల్లచట్టాలు, కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లు రద్దు చేయాలని వికారాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం ఎన్టీఆర్ చౌరస్తాలో ఆందోలన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ మహిపాల్ అధ్యక్షత వహించగా ఈ సందర్భంగా బి ఆర్ టి యు జిల్లా అధ్యక్షులు భూమోల్ల కృష్ణయ్య, ఐ ఎఫ్ టి యు జిల్లా కార్యదర్శి వై గీత, ఏ ఐ కె ఎస్ జిల్లా కార్యదర్శి గోపాల్ రెడ్డి, ఏ ఐ కె ఎమ్ ఎస్ జిల్లా అధ్యక్షులు వై మహేందర్,సిఐటియు జిల్లా కార్యదర్శి రామకృష్ణ, ఏ ఐ టి యు సి జిల్లా కార్యదర్శి మహమ్మద్, పిడి ఎస్ యు జిల్లా అధ్యక్షులు పి శ్రీనివాస్ ఆశా వర్కర్ల యూనియన్ నాయకురాలు మంగమ్మ లు మాట్లాడుతూ సంయుక్త కిసాన్ మోర్చా( ఎస్ కె ఎం), కార్మిక సంఘాల దేశవ్యాప్త పిలుపులో భాగంగా ఈరోజు వ్యవసాయ, రైతు, కార్మిక సంఘాల జిల్లా కమిటీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగిందని, కేంద్ర ప్రభుత్వం దేశంలోని వ్యవసాయ రంగాన్ని, ప్రభుత్వ రంగ సంస్థలను ఆధాని, అంబానీ లాంటి కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టుటకై రైతు వ్యతిరేక నల్ల చట్టాలను, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ లను తీసుకువచ్చాడని, ఈ చట్టాలను రద్ధు చేసేవరకు దశల వారి పోరాటాలకు సిద్ధం కావాలని రైతులకు, కార్మికులకు పిలుపునిచ్చారు.
కొంతమంది పెట్టుబడిదారుల కోసం యావద్దేశ సంపదనంతా దార దత్తం చేస్తూ పేదల యొక్క జీవన ప్రమాణాలను దెబ్బతీస్తూ హక్కుల పైన ఆంక్షలు విధిస్తూ కార్మిక వర్గాన్ని రైతాంగాన్ని, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మికుల పక్షాన రైతుల పక్షాన పోరాటాలు చేస్తూనే ఉంటామని రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ రైతు కార్మిక సంఘాల నాయకులు వెంకటయ్య, మల్లేష్, శ్రీకాంత్, రాములు, సుదర్శన్, సురేష్, అనంతయ్య, పద్మమ్మ తదితరులు పాల్గొన్నారు.