by Suryaa Desk | Thu, Nov 28, 2024, 10:42 AM
వెంపేట్ గ్రామంలో మంగళవారం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకము మరియు ప్రజా పాలన ప్రజా విజయోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు.అదేవిధంగా రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని గ్రామపంచాయతీ నందు సమావేశం ఏర్పాటు చేసుకొని ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి డిఆర్డివో పీడీ రఘువరన్ పాల్గొని,గ్రామంలో జరుగుతున్న పనులను పరిశీలించి, గ్రామ సిబ్బందికి సన్మానం చేశారు.
ఈ సందర్బంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అల్లూరి మహేందర్ రెడ్డి గ్రామానికి సంబందించిన అభివృధి పనులకు 50 లక్షలు మంజూరు చేయాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది.గ్రామానికి చెందిన ఏలేటి శంకర్ రెడ్డి కి మంజూరు అయిన క్యాటల్ షేడ్ భూమి పూజను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఓదెల రామకృష్ణ, ఎంపివో మహేశ్వర్, ఏపీవో తిరుపతి రావు , ఫీల్డ్ అసిస్టెంట్ రాము, ఆశ వర్కర్స్, అంగన్వాడీ మహిళలు మరియు కూలీలు, రైతులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.