by Suryaa Desk | Thu, Nov 28, 2024, 10:35 AM
వికారాబాద్ జిల్లా భరోసా సెంటర్ లో ఔట్ సోర్సింగ్ పద్ధతిపై పని చేయుటకు 3 ఖాళీలు ఉన్నాయి. అందుకు గాను అర్హత కలిగి ఆసక్తి గల మహిళా అభ్యర్థులు జిల్లా పోలీస్ కార్యలయంలోని భరోసా కేంద్రం నందు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎస్పి కె.నారాయణ రెడ్డి తెలిపారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం సెంటర్-కొ-ఆర్డినేటర్(1), సపోర్ట్ పర్సన్(2), ఈ ఉద్యోగ నియామకాలు ఒక సంవత్సరం కాలవ్యవధి కొరకు మాత్రమే అన్నారు. అదే కాలవ్యవధిలో ఆవశ్యకత బడ్జెట్ ప్రకారం ప్రతి సంవత్సరం పొడిగించబడుతుంది. నియామకం మొత్తం డి బిజినెస్ సోలుషన్స్ ఏజెన్సీ నుంచి జరుగుతాయని తెలిపారు.బయో-డేటా, ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్, అనుభవం సర్టిఫికెట్స్, అడిగిన పత్రాలు అన్ని మెయిల్ dbusinesssolutionzz@gmail.com ద్వారా, వాట్సాప్ 8712670063 ద్వారా పంపించవచ్చని తెలిపారు.
అర్హత నిబంధనలు 1.సెంటర్-కొ-ఆర్డినేటర్(1) కి ఎం ఏ, ఎం ఎస్ సి, సైకాలజీ విద్యార్హత కల్గి 2 సంవత్సరాల అనుభవం కల్గి ఉండాలన్నారు. రెమ్యూనరేషన్ 30,000 రూపాయలు ఉంటుందని తెలిపారు. 2. సపోర్ట్ పర్సన్(2) కి మాస్టర్ అప్ సోషల్ వర్క్ ( ఎం ఎస్ డబ్ల్యూ ) విద్యార్హత కల్గి ఒక సంవత్సరం అనుభవం కల్గి ఉండాలన్నారు. రెమ్యూనరేషన్ 20,000 రూపాయలుఉంటుందని తెలిపారు.