by Suryaa Desk | Thu, Nov 28, 2024, 10:08 AM
75 వ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కళాశాల తిప్పర్తి నందు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముందుగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి ప్రిన్సిపాల్ ఏ .అపర్ణ కార్యక్రమాన్ని ప్రారంభించారు విద్యార్థులచే భారత రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రిన్సిపల్ ఏ. అపర్ణ మాట్లాడుతూ 75 వ రాజ్యాంగ దినోత్సవం నేపథ్యం "జస్టిస్ ,ఈక్వాలిటీ ,రైట్ టు ఫ్రీడమ్" అని విద్యార్థులకు తెలియజేశారు ఇతరుల స్వేచ్ఛకు భంగం కలగకుండా ఇతరుల యొక్క అభిప్రాయాలకు విలువ ఇవ్వడం అని తెలిపారు.
భారత రాజ్యాంగ దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలను, ప్రాథమిక హక్కులను, విధుల గురించి ,వాటి ఉపయోగాల గురించి వాటితో పాటు విధులు కూడా నిర్వర్తించాలని తెలియజేశారు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని భారత ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించే విధంగా అన్ని అంశాలను పొందుపరిచారని భారత దేశ రాజ్యాంగము లిఖిత, దృఢ రాజ్యాంగం అని తెలియజేశారు ఈ సందర్భంగా విద్యార్థులు తమ పాటలు, ఉపన్యాసాలతో వివరించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.