by Suryaa Desk | Thu, Nov 28, 2024, 10:06 AM
సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలంలో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వలు ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో భాగంగా అనంతగిరి మండల వ్యాప్తంగా 19 గ్రామ పంచాయతీలకు గాను, మూడు క్లస్టర్లుగా విభజించి అనంతగిరి, గొండ్రియల, బొజ్జ గూడెం తండా,అమీనాబాద్, త్రిపురవరం గ్రామాలలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ,ఇందిరా క్రాంతి పంతం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడంలో నిర్వాహకులు విఫలం చెందారని ప్రజల ఆరోపిస్తున్నారు. రైతులకు ధాన్యం తేమ శాతం ఇతరత్రా విషయాలలో అవగాహన కల్పించకపోవడంతో రైతులు దళారులను సంప్రదిస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
మండల వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలలో నిర్వాహకులకు తేమను పరీక్షించే పరికరం పై అవగాహన లేకపోవడంతో తేమశాతం అధికంగా ఉందంటూ నిర్వాహకులు రైతులకు చెప్పడంతో వారు దళారులను సంప్రదించాల్సిన పరిస్థితి నెలకొన్నది. అవసరమైన ప్రదేశాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిర్వహించకుండా కొనుగోలు కేంద్రాలు నడవని ప్రదేశాల్లో నిర్వహిస్తూ రైతులకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై దళారులకు, అధికారులు, కొమ్ముకస్తున్నారేమో అని అనుమానాలు లేకపోలేదు. కేంద్ర ప్రభుత్వం క్వింటా ధాన్యానికి గిట్టుబాటు ధర 2300 రూపాయలు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం 500 బోనస్ కలుపుకొని 2800గా ప్రభుత్వం ధర నిర్ణయించింది. కానీ అనంతగిరి మండలంలో దళారుల రాజ్యం నడుస్తుందనీ చెప్పవచ్చు.. ఇకనైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని పలువురు రైతులు కోరారు.