by Suryaa Desk | Thu, Nov 28, 2024, 10:37 AM
మహబూబాబాద్ జిల్లా, గూడూరు మండలం, బ్రాహ్మణపల్లి గ్రామంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలను, మహబూబాబాద్ జిల్లా విద్య అధికారి ఎ. రవీందర్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. పదవ తరగతి పిల్లలతో సంభాషించి, 100% ఉత్తీర్ణత సాధించాలని, ఎక్కువ మంది విద్యార్థునీలు 10 జిపిఏ తెచ్చుకోవాలని, అభ్యాస దీపికలు సాధన చేయాలని సూచనలు చేశారు.
పాఠశాల ప్రాంగణ పరిసరాలను సందర్శించడంలో భాగంగా, డైనింగ్ హాల్, వంటశాల లో వండే పద్ధతి, కూరగాయలతో పాటుగా ప్రతి వస్తువు భద్రపరిచే విధానంను పరిశీలించారు. ఆరోగ్య సూచనలను ఇచ్చి, ప్రతిరోజు పిల్లల ఆరోగ్య సమాచారం నమోదు చేస్తున్నారా! లేదా? అనే సమాచారం తెలుసుకొని, ప్రతిరోజు తప్పక విద్యార్థి సమాచారంను నమోదు చేయాలని సంబంధిత వార్డెన్ ను ఆదేశించారు.