by Suryaa Desk | Thu, Nov 28, 2024, 10:15 AM
మంగళవారం రోజు కనగల్ మండలం గడ్డంవారి యడవల్లి లోని జడ్పీహెచ్ఎస్ లో మౌళిక వసతులు కల్పనకు రాష్ట్ర మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిధులు తో రూ.5 లక్షలతో, సి.సి రోడ్డు& మురుగుదోడ్లు , నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలో మరుగుదొడ్లు సరిగా లేవని తన దృష్టికి వచ్చిందని వాటిని ఏర్పాటు చేయిస్తానని గతంలో హామీ ఇచ్చాను , విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు , విద్యార్థుల భవిష్యత్తు కోసం ఉపాధ్యాయులు విద్యార్థులు నాణ్యమైన విద్యను అందించాలన్నారు , విద్యార్థులకు అన్ని అంశాలలో నూటికి నూరు శాతం కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కనగల్ మాజీ జెడ్పిటిసి సభ్యులు నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్ , కనగల్ మాజీ పిఎస్ చైర్మన్ దేవిరెడ్డి వెంకట్ రెడ్డి , మాజీ సర్పంచ్ జగల్ రెడ్డి , కేసాని వెంకట్ రెడ్డి , కనగల్ మండలం యూత్ అధ్యక్షులు కూసుకుంట్ల రాజిరెడ్డి , జడ్.పి.హెచ్.ఎస్ ప్రధానోపాధ్యాయురాలు దొడ్డి విజయలక్ష్మి , ఉపాధ్యాయులు కొప్పుల యాదగిరి , చంద్రమోహన్, వెంకటేశ్వర్లు, జి.యడవల్లి కాంగ్రెస్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.