by Suryaa Desk | Thu, Nov 28, 2024, 10:04 AM
భారతదేశ చట్ట సభలకు జరిగే ఎన్నికలలో ఈవీఎంలను రద్దుచేసి బ్యాలెట్ ఓటింగ్ ప్రవేశపెట్టాలని సుప్రీంకోర్టులో వేసిన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ (పిల్) ను కొట్టి వేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు విక్రమ్ నాథ్ ,పి.బి.వరాలే తీర్పు ఇచ్చారని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఫిజికల్ బ్యాలెట్ ఓటింగ్ కావాలని సుప్రీంకోర్టులో మత ప్రచారకుడు డాక్టర్ కె.ఎ పాల్ వేసిన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ను విచారించిన న్యాయస్థానం, ఎన్నికలలో ఓటమి చెందిన వారు తప్పు పట్టడం మంచిది కాదని, ఎన్నికలలో గెలిచినప్పుడు ఉండని ఫిర్యాదులు,ఓడిపోతే మాత్రం ఈవిఎం లను ప్రశ్నించడం మంచిది కాదని తెలిపిందని జిల్లా ఎన్నికల అధికారి ఆ ప్రకటనలో పేర్కొన్నారు.