by Suryaa Desk | Thu, Nov 28, 2024, 10:27 AM
అనంతగిరి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఇందిరా క్రాంతి పంతం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మండల వ్యవసాయ అధికారి అందే సతీష్ మంగళవారం పరిశీలించారు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసిన ప్రదేశంలో ధాన్యాన్ని పరిశీలించి రైతులకు నిర్వాహకులకు తగిన సూచనలు అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఏ వన్ గ్రేడ్ ధాన్యంకు 2320 ధర అందజేస్తుందని బోనస్ 500 కలుపుకొని మొత్తం 2820 మద్దతు ధర అందజేస్తుందని తెలిపారు రైతులు తేమ 17% ఉంటే ఈ గిట్టుబాటు ధర లభిస్తుందని తెలిపారు ధాన్యం కొనుగోలు కేంద్రం వద్దకు ధాన్యం తీసుకు వచ్చిన వెంటనే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తెలిపారు.
ఆధార్ పాస్ పుస్తకం ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ నకలు నిర్వాహకులు అందజేయాలని పేర్కొన్నారు ప్రభుత్వం ఏర్పాటుచేసిన దాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం అందిస్తున్న గిట్టుబాటు ధరను పొందాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వివో ఏ శ్రీను నిర్వాహకులు గంగరబోయిన లింగమ్మ పాలూరి ఉష కొత్తపల్లి ఉపేంద్ర గాదం స్వరూప పాల్గొన్నారు