by Suryaa Desk | Thu, Nov 28, 2024, 11:02 AM
తెలంగాణలో వాతావరణం తెలంగాణలో పొడి వాతావరణం ఉంటుంది. తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగా తగ్గిపోయాయి. ఆదిలాబాద్ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రత 9.7 డిగ్రీలుగా నమోదు అయింది. సాధారణం ఉష్ణోగ్రత 1.6 నుంచి 3 డిగ్రీల మధ్య తగ్గిన ప్రాంతాలు దుండిగల్, నిజామాబాద్, రామగుండం, పటాన్చెరు, సాధారణ ఉష్ణోగ్రత 3 నుంచి ఐదు డిగ్రీల మధ్య పడిపోయిన ప్రాంతాలు హన్మకొండ, మెదక్, సాధారణ ఉష్ణోగ్రత ఐదు డిగ్రీల కంటే ఎక్కువ పడిపోయిన ప్రాంతం ఆదిలాబాద్. ఈ ప్రాంతాల మినహా మిగిలిన ప్రాంతాల్లో సాధారణ ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీలు చొప్పున తగ్గుముఖం పట్టాయి.ఆకాశం నిర్మలంగా ఉంటుంది. ఉదయం వేళల్లో పొగమంచు ఉండే అవకాశం ఉంది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 29°C, 16°C ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు తూర్పు/ఈశాన్య దిశలో గంటకు 04-08 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉంది.నమోదైన వాతావరణం: గరిష్ట ఉష్ణోగ్రత: 28.5°C కనిష్ట ఉష్ణోగ్రత: 15.5°Cవివిధ ప్రాంతాల్లో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు ఇలా ఉన్నాయి.