by Suryaa Desk | Thu, Nov 28, 2024, 10:52 AM
విద్యార్థులకు అందించే భోజన ఏర్పాట్లలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ హెచ్చరించారు. మెట్ పల్లి మున్సిపల్ పరిధిలోని ఆరపేట్ లో సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలను జిల్లా కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులను, వంట శాలను, స్టోర్ రూమ్ తనిఖీ చేశారు. ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. విద్యార్థుల ఆరోగ్య గురించి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు.
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, నాణ్యమైన భోజనం అందించాలన్నారు. మెనూ ప్రకారం భోజనం ఏర్పాటు చేయాలని సూచించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్య వహించే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. కలెక్టర్ వెంట షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి రాజ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ మోహన్ తదితరులు ఉన్నారు.