by Suryaa Desk | Thu, Nov 28, 2024, 02:58 PM
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కు తెలంగాణ హై కోర్టు లో షాక్ తగిలింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లకుండా ఆదేశాలివ్వాలంటూ కేఏ పాల్ హైకోర్టులో మధ్యంతర పిటిషన్ వేశారు.వారంతా అసెంబ్లీ నిర్ణయాల్లో జోక్యం చేసుకోకుండా, ప్రవేశపెట్టే తీర్మానాలకు ఓటు వేయకుండా ఆదేశించాలని కోరారు. ఈ పిటిషన్ పై విచారణ చేసిన హైకోర్టు.. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీలో ప్రవేశం లేదని చెప్పడం కుదరదని స్పష్టం చేసింది. కేఏ పాల్ వేసిన మధ్యంతర పిటిషన్ ను డిస్మిస్ చేసింది.కాగా.. డిసెంబర్ 9 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగవచ్చని తెలుస్తోంది. డిసెంబర్ 7 నాటికి రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి కానుంది. దీంతో మంత్రివర్గ విస్తరణ కూడా ఆ రోజుకి పూర్తి చేస్తారని సమాచారం. రేపు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి.. సీడబ్ల్యూసీ సమావేశానికి హాజరుకానున్నారు. అనంతరం కాంగ్రెస్ పెద్దలతో సమావేశమై మంత్రివర్గ విస్తరణపై చర్చించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.