|
|
by Suryaa Desk | Thu, Feb 12, 2026, 03:37 PM
మామూనూరు విమానాశ్రయానికి భూసేకరణ పూర్తి అయినందున అవసరమైన పనులు చేపట్టాలని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుకి సీఎం రేవంత్ రెడ్డి వినతి. ఈ రోజు ఢిల్లీలో పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడుతో భేటీ అయ్యి, రాష్ట్రంలో ప్రతిపాదిత విమానాశ్రయాల నిర్మాణం పై చర్చించాను. . కొత్తగూడెం ప్రతిపాదిత విమానాశ్రయానికి పాల్వంచలో స్థలం గుర్తించామని, OLS సర్వే, ఫీజుబిలిటీ స్టడీ నిర్వహించాలని కోరాను. అంతర్గాం ప్రతిపాదిత విమానాశ్రయానికి ప్రత్యమ్నాయ స్థలం గుర్తించినందున వెంటనే అనుమతులు మంజూరు చేయాలని కోరాను. ఆదిలాబాద్ ప్రతిపాదిత విమానాశ్రయానికి సంబంధించి అదనంగా 249.82 ఎకరాలు కేంద్రానికి అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నామని, వెంటనే పనులు మొదలు పెట్టాలని కోరాను. ఈ భేటీలో పలువురు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు పాల్గొన్నారు.