|
|
by Suryaa Desk | Wed, Feb 25, 2026, 12:50 PM
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ సర్కిల్ పరిధిలోని భౌరంపేట్‌లో స్థానిక యువకులు నూతనంగా ఏర్పాటు చేసుకున్న శ్రీ వెంకటేశ్వర రియల్ ఎస్టేట్స్ నూతన కార్యాలయాన్ని ఈరోజు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా బి ఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, గౌరవ ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు గారు ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ గారు మాట్లాడుతూ, యువత వ్యాపార రంగంలో ముందుకు రావడం అభినందనీయమని, ఇటువంటి సంస్థలు స్థానికంగా ఉపాధి అవకాశాలు సృష్టించి ప్రాంత అభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు. సంస్థ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం సంస్థ యాజమాన్యం మరియు స్థానిక నాయకులు కలిసి ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు గారిని శాలువాతో ఘనంగా సన్మానించి తమ కృతజ్ఞతలను తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఎస్.వి. రవీందర్ రెడ్డి గారు, భౌరంపేట్ మాజీ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, BRS పార్టీ నాయకులు పోలీస్ గోవింద్ రెడ్డి గారు, ధర్మారెడ్డి గారు, మురళీ యాదవ్ గారు, చింత మల్లేష్ గారు, శంభిపూర్ నగేష్ గారు, మన్నే బలరాజ్ గారు అలాగే సంస్థ యాజమాన్యం గడిల బాబు, శంభిపూర్ రవిరాజ్, శ్రీకాంత్, సాయి తదితరులు పాల్గొన్నారు.