|
|
by Suryaa Desk | Wed, Feb 25, 2026, 12:55 PM
పటాన్చెరు : పటాన్చెరు డివిజన్ పరిధిలోని నూతన కాలనీల అభివృద్ధికి ప్రణాళిక ప్రకారం నిధులు మంజూరు చేస్తున్నామని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని నందన్ ప్యారడైజ్ కాలనీలో ఒక కోటి 35 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న అంతర్గత మురుగునీటి కాలువల నిర్మాణ పనులకు బుధవారం ఉదయం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పటాన్చెరు డివిజన్ పరిధిలో నూతనంగా ఏర్పాటవుతున్న కాలనీలలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.