![]() |
![]() |
by Suryaa Desk | Tue, Mar 25, 2025, 12:40 PM
‘నేను మాములుగా ఆంజనేయ స్వామి భక్తుడిని. కానీ ‘కన్నప్ప’తో ప్రయాణం మొదలయ్యాక శివ భక్తుడిగా మారిపోయా. ఈ ప్రయాణంలో చాలా నేర్చుకున్నా. కన్నప్ప చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రభాస్ పాత్రను ఎంత ఊహించుకున్నా అంతకు మించి అనేలా ఉంటుంది’ అని చెప్పారు మంచు విష్ణు. ఆయన నటిస్తున్న ‘కన్నప్ప’ చిత్రం వచ్చే నెల 25న విడుదలవుతోంది. ఈ సందర్భంగా రెడ్ లారీ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప’ టీమ్ పాల్గొని, మీడియాతో ముచ్చటించింది. ఈ కార్యక్రమంలో మీడియా ప్రతినిఽధులు అడిగిన ప్రశ్నకు విష్ణు సమాధానం ఇస్తూ ‘నేను మాట్లాడిన మాటల్లో ఏదన్నా వాక్యం కట్ చేసి వైరల్ చేసి వివాదం సృష్టించాలనుకుంటే పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలు చాలా స్మార్ట్.. కొంచెం వివాదమైనా పూర్తి వీడియో చూసి నిజానిజాలు తెలుసుకుంటున్నారు’ అన్నారు. పక్కనే ఉన్న రఘుబాబు మైక్ అందుకుని ‘ఈ సినిమా గురించి ఎవరైనా ట్రోల్ చేస్తే శివుడి ఆగ్రహానికి, శాపానికి గురవుతారు. వంద శాతం కచ్చితంగా చెబుతున్నా. ట్రోల్ చేస్తే ఇక ఫినిష్షే’ అన్నారు. ‘దర్శకుడు ముఖేశ్‌కుమార్ సింగ్ మాట్లాడుతూ ‘ఆ శివుడే నన్ను ఈ ప్రాజెక్ట్‌లోకి పంపించాడు. ‘మహాభారత్’ సీరియల్‌ను అందరూ ప్రేమించారు. అలాగే అదే స్థాయిలో కన్నప్పను ఆరాధిస్తారు, గౌరవిస్తారు’ అని చెప్పారు.
Latest News