|
|
by Suryaa Desk | Sun, Apr 27, 2025, 12:40 PM
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఎట్టకేలకి నటిగాను, నిర్మాతగాను అలరించేందుకు సిద్ధమైంది. సమంత నటిస్తూ నిర్మించిన ‘శుభం’ చిత్రం మే 9న విడుదల కానుండగా, ప్రస్తుతం మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్‌తో కథ ఏంటో సింపుల్‌గా చెప్పే ప్రయత్నం చేశారు. ఈ సినిమా హిట్ అయితే సమంత మళ్లీ గాడిలో పడుతుందని అంటున్నారు.అలా చూస్తూ దెయ్యాల్లా మారిపోతారు. ఇక ఇంట్లో మగాళ్లకి రక్షణ కరువు అవుతున్న సమయంలో ఓ మాతగా సమంత కనిపిస్తుంది.మాత సమంత వారిని ఎలా రక్షిస్తుంది? అసలు మహిళలంతా అలా ఎందుకు వింతగా ప్రవర్తిస్తారు? అన్న పాయింట్లే సినిమాలో చూపించబోతున్నట్టు ట్రైలర్‌ని చూస్తే అర్ధమవుతుంది. సమంత డిఫరెంట్ రోల్‌లో దెయ్యాలను వదిలించే మాతగా కనిపించడం, భర్తలందరూ తమ భార్యలు దెయ్యాలుగా మారడాన్ని తట్టుకోలేక.. ఆవిడ దగ్గరకు వెళ్లి ‘మాతా.. ఇప్పుడు మా అందరికీ ఏం జరగబోతోంది?’ అని ప్రశ్నించడం, సమంత సైగలతో చేసే ఎక్స్‌ప్రెషన్స్ అయితే మూవీపై ఆసక్తిని పెంచాయి.
Latest News