|
|
by Suryaa Desk | Thu, May 29, 2025, 07:14 PM
ఓటీటీలో అత్యధిక మంది వీక్షించిన సినిమాగా 'సలార్' రికార్డు సృష్టించింది. రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సలార్’. OTTలో వరుసగా 366 రోజులు ట్రెండింగ్‌లో నిలిచి "సలార్: పార్ట్ 1 - సీజ్ ఫైర్" చిత్రం గణనీయమైన రికార్డును సాధించింది. ఈ ఏడాది మార్చిలో భారతీయ ఓటీటీల్లో అత్యధిమంది వీక్షించిన చిత్రంగా రికార్డుకెక్కింది. ఈ విషయాన్ని నీల్సన్ నివేదిక వెల్లడించింది.థియేటర్లలో మాత్రమే కాకుండా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో కూడా ఈ చిత్రం మంచి సక్సెస్ అందుకుంది. సాధారణంగా ఏ సినిమా అయినా ఒకటి లేదా రెండు ఓటీటీలలో ప్రసారమవుతాయి కానీ ఈ సినిమా ఏకంగా ఏడు ఓటీటీలలో ప్రసారమైనప్పటికీ అన్నింటిలోనూ అదే స్థాయిలో సక్సెస్ అందుకుంది. ఇదిలా ఉండగా తాజాగా నిల్సన్ సర్వేలో భాగంగా సలార్ సినిమా గురించి ఆసక్తికరమైన విషయం బయటపడింది.లక్ష కంటే ఎక్కువ జనాభా ఉన్న పట్టణాల్లో 18 నుంచి 45 సంవత్సరాల వయస్సు ఉన్నవారు ఈ సినిమాని ఎక్కువగా మొబైల్ ఫోన్లో చూసినట్టు ఈ సర్వే వెల్లడించింది. మామూలుగా అయితే మొబైల్ స్క్రీన్ (Mobile Screen)పై చాలా మంది కొరియన్, ఇంగ్లీష్ వెబ్ సిరీస్ లను చూస్తారు. అదే విధంగా తెలుగు వెబ్ సిరీస్ లను కూడా చూస్తారు కానీ ఇప్పటివరకు ఏ సినిమాని చూడని విధంగా సలార్ సినిమాని మొబైల్ స్క్రీన్ పై అత్యధికంగా చూసినట్టు ఈ సర్వేలో వెల్లడికావడంతో ప్రభాస్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Latest News