by Suryaa Desk | Wed, Nov 20, 2024, 04:13 PM
రంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శివరాంపల్లిలో శ్రీ లక్ష్మీ క్లాత్ టెక్స్టైల్ బట్టల దుకాణంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా బుధవారం భారీగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు వ్యాపించడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.10 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు.