|
|
by Suryaa Desk | Fri, Feb 20, 2026, 03:53 PM
చింతపల్లి మండలం మాల్ గ్రామంలో శుక్రవారం కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని నియోజకవర్గ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్, నల్గొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులతో కలిసి ఆవిష్కరించారు. తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమానికి బాపూజీ అందించిన స్ఫూర్తి, త్యాగం మరువలేనిదని, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషిని కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా కొనసాగిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం కుర్మడ్ X రోడ్డు మార్కెండేయ కాలనీలో గణపతి శివ పార్వతుల ఆంజనేయ స్వామి నవగ్రహ దేవాలయ శంకుస్థాపన మహోత్సవంలో పాల్గొన్నారు.