![]() |
![]() |
by Suryaa Desk | Tue, Mar 18, 2025, 01:42 PM
జాతీయ స్థాయిలో ఈ ఏడాది సెప్టెంబర్‌లో నిర్వహించనున్న జాతీయ మిసెస్ ఇండియా పోటీల్లో ప్రియాంక తారే తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్ నుంచి వచ్చి నగరంలో స్థిరపడిన ఆమె మిసెస్ ఇండియా తెలంగాణ క్వీన్ 2025 అనే బిరుదుతోపాటు మిసెస్ ప్యాషనేట్ అవార్డు గెలుచుకుంది. ఈ నేపథ్యంలో జాతీయవేదికపై మిసెస్ ఇండియా పోటీలో తెలంగాణ సౌందర్యాభిలాషను ప్రదర్శించడం సంతోషంగా ఉందని ఆమె తెలిపారు.ప్రియాంక రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఫిట్‌నెస్ ఔత్సాహికురాలు కూడా. ఆమె తన డ్రీమ్‌ని నెరవేర్చుకోవడమే గాక ఇతరులను కూడా ఆ మార్గంలో వెళ్లేలా ప్రోత్సహిస్తోంది. అంతేగాదు వివిధ రకాల ఎన్‌జీవోలతో కలిసి నిరుపేద బాలికలు/పిల్లల సంక్షేమం, మహిళ సాధికారత వంటి సామాజిక కార్యక్రమాల కోసం తన వంతుగా సేవలందిస్తోంది.
Latest News