|
|
by Suryaa Desk | Thu, May 01, 2025, 04:27 PM
వేవ్స్ సమ్మిట్ ప్రారంభోత్సవం ప్రస్తుతం ముంబైలో ఈ రోజు జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ గౌరవాలు అందిస్తున్నారు. ఇన్ఫర్మేషన్ మరియు బ్రాడ్ కాస్టింగ్ మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న చిత్ర ప్రముఖులు హాజరయ్యారు. మోహన్ లాల్ Xలో కోన్ని చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. చిత్రాలలో మోహన్ లాల్, రజనీకాంత్, చిరంజీవి, హేమా మాలిని, అక్షయ్ కుమార్ మరియు ఇతరులు ఉన్నారు. షారుఖ్ ఖాన్, అమితాబ్, అమీర్ ఖాన్, రణబీర్ కపూర్, నాగార్జున, అనిల్ కపూర్, రాజమౌలి మరియు ఇతరులు కూడా ఈ ఈవెంట్ కి హాజరయ్యారు. ఈ కార్యక్రమం నాలుగు రోజులు జరుగుతుంది మరియు మీడియా, వినోదం మరియు డిజిటల్ ఆవిష్కరణలకు భారతదేశాన్ని గ్లోబల్ హబ్‌గా ఉంచడం ఈ ఈవెంట్ యొక్క ఉద్దేశ్యంగా ఉంది.
Latest News