by Suryaa Desk | Sat, Jul 13, 2024, 12:58 PM
ఉపకార వేత నాలు, ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఎ జిల్లా అధ్యక్ష కార్య దర్శులు మంద అనిల్, మల్లారపు ప్రశాంత్ లు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉపకార వేతనాలు విడుదల చేయాలని కోరుతూ శుక్రవారం సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ఎదుట ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఎస్ఎఫ్ఎ జిల్లా ఉపాధ్యక్షులు జాలపల్లి మనోజ్, కుర్ర రాకేష్, కార్యదర్శి కళ్యాణ్, అభిషేక్, సాత్విక్, శ్రీకాంత్, అనిల్, నందు, పాల్గొన్నారు.