by Suryaa Desk | Sat, Jul 13, 2024, 12:56 PM
కామారెడ్డి జిల్లా గాంధారి మండలం మాతృ సంగం గ్రామానికి చెందిన రాములకాంతం (42) కొన్ని రోజుల క్రితం బండి పై నుండి పడి కాలు విరిగి చేసిన అప్పులు తీర్చలేక జీవితంపై విరక్తి చెంది శుక్రవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో ఇంటి వెనకాల రేకుల షెడ్డు నందు ఉరి వేసుకొని చనిపోవడం జరిగింది. భార్య పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారని ఎస్సై ఆంజనేయులు తెలిపారు.