by Suryaa Desk | Fri, Nov 22, 2024, 12:58 PM
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పాలనను చూసి తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారు. పదేండ్ల పాలనలో ఒక్క ప్రాజెక్టు కట్టలేదు.. ఒక్క పరిశ్రమ రాలేదు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. దాదాపు పదిహేడు వేల ఎకరాల భూమిని సేకరించాము. ఎక్కడా కూడా బాధితులకు నష్టం రాకుండా పరిహారం అందించాము.కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేయలేదా మేము.. ఆ ప్రాజెక్టు ద్వారా వచ్చిన నీళ్ళే కదా ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వచ్చింది. మిడ్ మానేరుకు అక్కడ నుండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గుంటకు సాగునీళ్లు మేము ఇచ్చింది నిజం కాదా..? .ఇప్పుడు పది నెలల్లోనే మీరు ఏ ప్రాజెక్టు పూర్తి చేశారని అరవై మూడు లక్షల ఎకరాల్లో పంట పండిందని గొప్పగా చెప్పుకుంటున్నారని చూసి తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారు. రైతులు పండించిన పంట ఉన్న కల్లాల వద్దకు వెళ్ళే ధైర్యం ఏ కాంగ్రెస్ నేతకు లేదు అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నరు..