by Suryaa Desk | Tue, Nov 26, 2024, 07:09 PM
నారాయణపేట జిల్లాలోని మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మరోసారి ఫుడ్ పాయిజన్ కావడం తీవ్ర కలకలం రేపుతోంది. మంగళవారం మధ్యాహ్న భోజనం చేసిన 21 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
విద్యార్థులు వాంతులు, కడుపునొప్పితో అల్లాడిపోయారు. దీంతో వెంటనే వారిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను కారులో ఆసుపత్రికి తరలించారు.