|
|
by Suryaa Desk | Sat, Nov 08, 2025, 05:10 PM
ప్రతిపక్షాలు చొరబాటుదారులను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయన్న బీజేపీ ఆరోపణలను ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా ఖండించారు. ఒకవేళ దేశంలోకి చొరబాటుదారులు వస్తున్నారంటే, అది పూర్తిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యమేనని, ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం నితీశ్ కుమార్ దీనికి బాధ్యత వహించాలని ఆయన అన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్‌కు ముందు కిషన్‌గంజ్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు."ముఖ్యమంత్రి మీవాడే, కేంద్ర హోంమంత్రి మీవాడే, ప్రధాని కూడా మీరే. మీ కళ్లెదుటే చొరబాటుదారులు ఎలా వస్తున్నారు? ఒకవేళ వారు వస్తున్నారంటే అది మీ పరిపాలనా వైఫల్యమే కదా? మీ చేతుల్లో బీఎస్ఎఫ్, సీమా సురక్షా బల్ ఉన్నాయి. అయినా చొరబాటులు జరుగుతున్నాయని మీరే ఆరోపిస్తున్నారు" అని ఒవైసీ ప్రభుత్వాన్ని నిలదీశారు.