|
|
by Suryaa Desk | Fri, Mar 06, 2026, 08:28 PM
ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం నేపథ్యంలో భారత్ నుంచి కోడి గుడ్ల ఎగుమతికి తీవ్ర అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో గుడ్ల నిల్వ పెరిగిపోతున్న కారణంగా వాటి రేటు సగానికి పైగా తగ్గిస్తున్నట్లు NECC ప్రకటించింది ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కారణంగా గగనతల, సముద్ర మార్గాలపై ఆంక్షలు విధించింది. దీంతో మార్చి 1 నుండి నామక్కల్ నుంచి గల్ఫ్ దేశాలకు (యూఏఈ, ఒమన్, ఖతార్) జరిగే గుడ్ల ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. భారతదేశపు అతిపెద్ద గుడ్ల ఉత్పత్తి కేంద్రమైన నామక్కల్ నుంచి సుమారు కోటి గుడ్లు కోల్డ్ స్టోరేజీల్లోనే నిలిచిపోయాయి. ఇవి త్వరగా పాడయ్యే అవకాశం ఉండటంతో వ్యాపారులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఎగుమతులు నిలిచిపోవడంతో ఆ నిల్వలన్నీ స్థానిక మార్కెట్‌కు మళ్లాయి. దీనివల్ల దేశీయంగా గుడ్ల ధరలు భారీగా పడిపోయాయి. ఒక గుడ్డుకు రూ.4.50 మాత్రమే పలుకుతోంది.పెట్టుబడి కూడా రాకపోవడంతో రైతులు రోజుకు రూ.5 కోట్ల మేర నష్టపోతున్నారు. కేవలం గుడ్లే కాకుండా, తిరుచ్చి విమానాశ్రయం నుంచి వెళ్లే పండ్లు, కూరగాయల ఎగుమతులపై కూడా ఈ ప్రభావం పడింది. ఈ సంక్షోభం నుండి గట్టెక్కేందుకు కేంద్ర ప్రభుత్వం దౌత్యపరమైన చర్చలు జరపాలని ఎగుమతిదారులు కోరుతున్నారు. వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు 'సురక్షిత మార్గాన్ని' ఏర్పాటు చేసి, పరిశ్రమను అప్పుల ఊబి నుండి కాపాడాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.