|
|
by Suryaa Desk | Wed, Dec 17, 2025, 04:17 PM
యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా, విలక్షణ నటి ఐశ్వర్యా రాజేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ 'మఫ్టీ పోలీస్' ఇప్పుడు ఓటీటీ ద్వారా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ఆహా'లో ఈ చిత్రం డిసెంబర్ 19వ తేదీ (శుక్రవారం) నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు.తమిళంలో 'తీయవర్ కులై నడుంగ' పేరుతో గత నెల 21న ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. తెలుగులో 'మఫ్టీ పోలీస్' పేరుతో డబ్ చేసి విడుదల చేసినప్పటికీ, సరైన ప్రచారం లేకపోవడంతో ఎప్పుడు వచ్చి వెళ్లిందో కూడా చాలా మందికి తెలియకుండా పోయింది. అయితే, థియేటర్లలో ఆకట్టుకోలేకపోయిన ఈ చిత్రం ఓటీటీలో ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి. ఇప్పటికే ఈ చిత్ర తమిళ వెర్షన్ 'సన్ నెక్స్ట్' ఓటీటీలో అందుబాటులో ఉంది.
Latest News