|
|
by Suryaa Desk | Sat, Oct 14, 2023, 03:59 PM
హీరో విజయ్ నటించిన తాజా చిత్రం ‘లియో’ ఈనెల 19న విడుదలకానున్న నేపథ్యంలో రోజుకు ఐదు ఆటలు ప్రదర్శించుకునేందుకు తమిళనాడు ప్రభుత్వం అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 19 నుంచి 24వ తేదీ వరకు ఐదు ఆటలు ప్రదర్శించుకునే వెసులుబాటును కల్పించింది. సినిమా విడుదల రోజైన 19వ తేదీ గురువారం మాత్రం తొలి ఆటను ఉదయం 5 గంటలకు ప్రారంభించవచ్చు. 20వ తేదీ నుంచి 24వ తేదీ వరకు రోజుకు నాలుగు ఆటలతో పాటు ప్రత్యేక షో ఉదయం 9గంటలకు ప్రదర్శించుకునేందుకు అనుమతి ఇచ్చినట్టు ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ పి. అముద పేర్కొన్నారు.
Latest News