![]() |
![]() |
by Suryaa Desk | Tue, Mar 18, 2025, 10:23 AM
‘గతంలో నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాను. క్షమించండి. తెలిసో తెలియకో చేసిన నా తప్పుని క్షమిస్తారని అనుకుంటున్నాను’ అని రీతూ చౌదరి తెలిపింది. దయచేసి ఏ బెట్టింగ్ యాప్స్‌ను నమ్మకండని రీతూ చెప్పుకొచ్చింది. అయితే సారీ చెప్పినంత మాత్రాన పోలీసులు వీళ్లని వదిలేస్తారా అనేది సందేహమే.దీంతో ఇలాంటి బెట్టింగ్ యాప్స్‌ని బ్యాన్ చేస్తూ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగానే ఇలాంటి యాప్స్‌ని ప్రమోట్ చేస్తున్న సెలబ్రెటీలపై కూడా దృష్టి పెట్టింది. ఒకరిద్దరు యూట్యూబర్లని కూడా అదుపులోకి తీసుకుంది. దీంతో మిగిలిన యూట్యూబర్లు, సెలబ్రెటీలు అలర్ట్ అయి నష్టనివారణ చర్యలు చేపడుతున్నారు. తాజాగా తమ సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్‌కి నో చెప్పండి అంటూ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లో బుల్లితెర బ్యూటీ రీతూ చౌదరి కూడా చేరింది.
Latest News