![]() |
![]() |
by Suryaa Desk | Tue, Mar 18, 2025, 12:04 PM
భారత క్రికెట్ దిగ్గజం సౌరభ్ గంగూలీ సినీ రంగ ప్రవేశం చేస్తున్నాడా? అంటూ అభిమానుల్లో నెలకొన్న సందేహాలకు నెట్ ఫ్లిక్స్ తెరదించింది. ఖాకీ: ది బెంగాల్ చాప్టర్-2 అనే వెబ్ సిరీస్ పోస్టర్లలో గంగూలీ పోలీస్ యూనిఫాంలో కనిపించడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు. దాంతో ఊహాగానాలు జోరందుకున్నాయి.అయితే ఈ ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పెడుతూ, నెట్ ఫ్లిక్స్ స్పష్టత ఇచ్చింది. ఈ మేరకు సోషల్ మీడియాలో వీడియో పంచుకుంది. ఈ వీడియోను బట్టి... గంగూలీ ఈ వెబ్ సిరీస్ లో నటించడంలేదని, కేవలం ప్రమోషన్ లో మాత్రమే భాగం పంచుకున్నాడని స్పష్టమైంది. మొత్తమ్మీద ఈ ప్రమోషన్ వీడియో గంగూలీ అభిమానులను విశేషంగా అలరిస్తుందనడంలో సందేహం లేదు. బెంగాల్ చాప్టర్ వెబ్ సిరీస్.... 'ఖాకీ: ది బీహార్ చాప్టర్'కు సీక్వెల్ గా వస్తోంది. ఐపీఎస్ అధికారి అమిత్ లోథా జీవితంలోని నిజ సంఘటనల ఆధారంగా 'బీహార్ చాప్టర్' గతంలో విడుదలై సంచలనం సృష్టించింది. ఇప్పుడు 'బెంగాల్ చాప్టర్' కూడా అదే స్థాయిలో ప్రేక్షకులను మెప్పిస్తుందా లేదా అనేది చూడాలి.
Latest News