![]() |
![]() |
by Suryaa Desk | Tue, Mar 18, 2025, 12:06 PM
బెట్టింగ్‌లపై ప్రముఖ సినీ నటుడు సంపూర్ణేష్‌బాబు కీలక వ్యాఖ్యలు చేశాడు. బెట్టింగ్ యాప్స్‌కు దూరంగా ఉండాలని ప్రజలకు పిలుపునిస్తూ ఓ వీడియోను విడుదల చేశాడు.. అందులో ఆయన మాట్లాడుతూ.. యువత బెట్టింగ్ యాప్‌లకు బానిసలై జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. బెట్టింగ్‌ల వల్ల బాగుపడినట్టు చరిత్రలోనే లేదన్నాడు. ఇలాంటి వాటికి బానిసలయ్యే ముందు ఇంట్లో వారి గురించి ఆలోచించాలని కోరాడు. బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేస్తున్న వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరాడు. బెట్టింగ్ యాప్‌లపై ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో విపరీత చర్చ జరుగుతోంది. బెట్టింగ్ యాప్‌ల ద్వారా లక్షల రూపాయలు సంపాదించవచ్చన్న సోషల్ మీడియా ప్రమోషన్లతో ఎంతోమంది వాటి బారినపడి లక్షల రూపాయలు నష్టపోతున్నారు. ఈ క్రమంలో కొందరు తట్టుకోలేక ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. దీంతో ఈ బెట్టింగ్ యాప్‌లపై ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ పోరు ప్రారంభించారు. వాటికి దూరంగా ఉండాలని యువతకు పిలుపునిస్తూ ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారానికి స్పందించిన సంపూర్ణేష్‌బాబు తనవంతుగా ఈ వీడియోను విడుదల చేసి బెట్టింగ్ యాప్‌లకు దూరంగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చాడు.
Latest News