![]() |
![]() |
by Suryaa Desk | Tue, Mar 18, 2025, 02:00 PM
బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలపై పోలీసులు చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా బెట్టింగ్ యాప్‌కు ప్రమోట్ చేస్తున్న మరో హీరోయిన్ వీడియో వెలుగులోకి వచ్చింది. ఓ బెట్టింగ్ యాప్‌కు ప్రమోట్ చేసిన హీరోయిన్ నిధి అగర్వాల్‌పై చర్యలు తీసుకోవాలని ఓ నెటిజన్ కోరాడు. దీనిపై పోలీసులు ఏం చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.ఇకపోతే దాదాపు 11 మంది యూట్యూబర్లపై సిటీ పోలీసుల కేసు నమోదు చేశారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేస్తున్న యూట్యూబర్లపై కేసులు నమోదు చేస్తాం.. వీరిలో హర్షసాయి , విష్ణుప్రియ , సుప్రీత , ఇమ్రాన్ ఖాన్ , రీతు చౌదరి , టేస్టీ తేజ , అజయ్ , కిరణ్ గౌడ్ , భయ్యా సన్నీ యాదవ , సుధీర్ రాజు యాంకర్ శ్యామల లపై కేసులు నమోదు అయ్యాయి..వ్యూస్ కోసం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్లు..అలాగే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి డబ్బులు తీసుకుంటున్న యూట్యూబర్లపై కేసు నమోదు అయింది.
Latest News