|
|
by Suryaa Desk | Thu, Mar 20, 2025, 03:08 PM
ప్రముఖ యాంకర్ కమ్ హీరో ప్రదీప్ మాచిరాజు తన రెండవ చిత్రం "అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి" తో వెండితెరపైకి రాబోతున్నాడు. ఈ సినిమాకి నితిన్ మరియు భరత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో ప్రదీప్‌కి జోడీగా దీపికా పిల్లి నటించారు. ఈ సినిమా యొక్క థర్డ్ సింగల్ ని మొదటి చినుకు అనే టైటిల్ తో ఈ రోజు సాయంత్రం 5:04 గంటలకి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సాంగ్ వివరాలని ప్రాకటించారు. చంద్ర బోస్ ఈ సాంగ్ కి లిరిక్స్ అందించగా, సిద్ శ్రీరామ్ ఈ సాంగ్ కి తన గాత్రాణి అందించినట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, సత్య మరియు గెటప్ శ్రీను కీలక పాత్రలలో ప్రతిభావంతులైన తారాగణం ఉన్నారు. ఈ సినిమాకి రాధన్ సంగీతం సమకూరుస్తుండగా, ఎంఎన్ బాలరెడ్డి సినిమాటోగ్రఫీ, కోదాటి పవనకల్యాణ్ ఎడిటింగ్‌లు అందిస్తున్నారు. ఈ చిత్రానికి సందీప్ బొల్లా కథ, మాటలు రాశారు. మాంక్స్ అండ్ మంకీస్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మించారు. ఈ చిత్రం ఏప్రిల్ 11న విడుదల కానుంది.
Latest News