|
|
by Suryaa Desk | Thu, Mar 20, 2025, 03:21 PM
'వెయ్యి అపద్ధాలు' సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఎస్తర్ ఆ తరువాత 'భీమవరం బుల్లోడు' సినిమాతో మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్న ఎస్తర్ సినిమాలు చేస్తూనే రాపర్, సింగర్ నోయెల్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.అయితే మొదట్లో బాగానే ఉన్న వ్యక్తిగత కారణాలతో ఇద్దరు విడాకులు తీసుకుని విడిపోయారు. విడిపోయాక ఎస్తర్ మళ్ళీ సినీమాల్లో బిజీగా ఉంది. అయితే ఇటీవల గుర్తించుకోతగ్గ సినిమాల్లో నటించకపోయిన ఇంటర్వ్యూ ద్వారా కనిపిస్తోంది.హీరోయిన్ గా సక్సెస్ కాకపోవడం గురించి ఎస్తర్ మాట్లాడుతూ చెడ్డ దారిలో వెళ్లి త్వరగా ఎదగవచ్చని కానీ అలా పైకి రావడం తనకు ఇష్టం లేదంటూ చెప్పింది. చాలా మంది హీరోయిన్స్ లా తాను కమిట్మెంట్ వంటి విషయాలకు లొంగిపోయుంటే పెద్ద హీరోయిన్ అయ్యుండేదాన్నన్ని చెప్పారు. ఈ మధ్య కాలంలో ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి కూడా కమిట్మెంట్ అడుగుతున్నారని కొంతమంది హీరోయిన్స్ పేర్లు చెప్పి వాళ్ళు ఒకే అంటున్నారు మీరెందుకు అలా చేయరు అని అడుగుతున్నారని చెప్పారు. నిజానికి అలా హీరోయిన్స్ చేస్తున్నారో లేదో మన కళ్ళతో చూస్తే కానీ చెప్పలేం కానీ అలా ప్రారంభోత్సవం కి కూడా అడగటంతో అలాంటివాటికి దూరంగా ఉన్నట్లు మనకు దక్కిన దానికి సంతోషపడాలంటూ ఎస్తర్ తెలిపారు.
ఇక ఎస్తేర్ నోరాహ్ క్రిస్టియన్ కావడంతో క్రిస్టియనిటి గురించి పలు అంశాలను చెప్పారు. ఒకప్పుడు వ్యభిచారం చేసేవారు కనిపిస్తే రాళ్లతో కొట్టేవారు కానీ యేసు ప్రభు అలా చేయొద్దని ప్రజలకు చెప్పారు. అసలు వ్యభిచార గృహలకు వెళ్లేవారు లేకపోతే వాళ్ళు వ్యభిచారం చేయరు కదా అని ఆయన చెప్తారు. మనం ఒకరి మీద రాళ్లు వేసే ముందు అందుకు మనం అర్హులమా కదా అని చూసుకోవాలి అంటూ ఎస్తర్ తెలిపారు. వ్యభిచారం చేసే ఒక అమ్మాయి డబ్బు కోసం మాత్రమే ఆ పని చేస్తుంది అలాంటప్పుడు ఆమెకు కొంత డబ్బు ఇచ్చి ఈ పనిచేయొద్దని మగవాళ్ళు చెప్పొచ్చు కదా అలా ఎందుకు చేయలేరు కేవలం డబ్బు కోసం మాత్రమే ఒక స్త్రీ వ్యభిచారానికి ఒప్పుకుంటుంది అంటూ ఎస్తర్ తెలిపారు. అలాంటివాళ్లకు డబ్బు ఇచ్చి సహాయం చేయొచ్చు కదా ఒక పబ్ కి లేదా స్విగ్గి వంటి వాటిలో ఒకరోజు చేసే ఖర్చు ఆమెకు ఇచ్చిన ఆమెకు సహాయం చేసినట్లే కదా అపుడు ఆమె వ్యభిచారం చేయదు కదా అంటూ ఎస్తర్ తన అభిప్రాయాలను పంచుకున్నారు.
Latest News