by Suryaa Desk | Fri, Nov 22, 2024, 12:14 PM
జయశంకర్ భూపాలపల్లి జిల్లా అంబటిపల్లి గ్రామంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. గ్రామంలోని హనుమాన్ విగ్రహం దగ్దంకావడం ఊరంతా ఉలిక్కి పడేలా చేసింది..గర్భగుడిలోని విగ్రహం దగ్ధమవడం అంతు చిక్కని మిస్టరీగా మారింది.. విగ్రహం మంటల్లో కాలిపోవడం దృష్టశక్తుల పనా..? లేక ప్రమాద వశాత్తూ మంటలు చెలరేగాయా..? అనే అనుమానాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి..తమకు అండ అనుకున్న హనుమయ్య విగ్రహం దగ్ధకావడం ఊరికి అరిష్టమని ఆ గ్రామస్తులంతా ఆందోళన చెందుతున్నారు.ఈ ఘటన మహాదేవపూర్ మండలం అంబటిపల్లి గ్రామం లో జరిగింది.. గ్రామంలోని అమరేశ్వర ఆలయ ప్రాంగణంలో హనుమాన్ విగ్రహం ఉంది.. ఏం జరిగిందో తెలియదు గానీ, గురువారం సాయంత్రం హనుమాన్ విగ్రహం వద్ద మంటలు చెలరేగాయి.. హనుమాన్ విగ్రహానికి మొత్తం మంటలు వ్యాపించాయి..
హనుమాన్ విగ్రహం అగ్నికి ఆహుతి అవుతుండడం గమనించిన స్థానికులు నీళ్లు పోసి మంటలు ఆర్పారు.. కానీ మంటలు ఎలా చెలరేగాయి..? విగ్రహం పై ఎలా మంటలు వ్యాపించాయి.. అనేది ఎవరికి అంతు చిక్కడం లేదు.. ఎవరైనా దృష్టశక్తులు ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి..హనుమాన్ విగ్రహం మంటల్లో కాలిపోవడం ఊరికి అరిష్టమని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.. ఇప్పటికే పోలీసులకు సమాచారం అందించిన గ్రామస్తులు ఈరోజు ఉదయం ఆలయం వద్ద సమావేశమై సమిష్టి నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు.. ఏం జరుగుతుందో అని ఆందోళన ఊరందరినీ ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.